మహబూబ్‌నగర్‌లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి అరుణాచలం బయలుదేరిన ఈ బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉండగా వారిలో ముగ్గురు (శరనప్ప, మహేశ్వరీ, లక్ష్మిదుర్గ) తీవ్రంగా గాయపడ్డారు, మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు.
బస్సు జాతీయ రహదారి 44పై వేగంగా వెళ్తున్నప్పుడు, దాని ముందు వెళ్తున్న ఓ లారీ టైర్ పేలిపోయింది. బస్సుకు అడ్డంగా ఉన్న లారీని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ ఆ వేగంలో బస్సుని పక్కకు తిప్పడంతో అదుపుతప్పి బోల్తా పడింది.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని గాయపడినవారికి ప్రాధమిక చేసి మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కొరకు వారిని హైదరాబాద్ తరలించారు.
ఈ ఘటన పోలీస్ స్టేషన్ సమీపంలో జరుగడంతో పోలీసులు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో చాలా సేపు శ్రమించి క్లియర్ చేశారు. జిల్లా ఎస్పీ జానకి, సీఐ రామకృష్ణ, ఎస్సై నాగన్న సహాయ చర్యలు పర్యవేక్షించారు.