తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకి నోటు కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముందుకు వచ్చింది.
అయితే మొదటి నుంచి ఈ కేసు విచారణ జరిపిన ఇద్దరు న్యాయమూర్తులు ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. కానీ అప్పటి న్యాయమూర్తులు తీర్పు వెలువరించకుండా రిజర్వ్ చేశారు.
కనుక ఇదివరకు జరిగిన వాదనలను పరిగణనలోకి తీసుకొని ధర్మాసనం తీర్పు చెప్పలేదని, నిబంధనల ప్రకారం ఈ కేసులో వాదనలను మళ్ళీ మొదటి నుంచి వినాల్సి ఉంటుందని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు.
కనుక ఈ కేసు విచారణ కొరకు మరొక ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తామని, అది వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరిస్తుందని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
ఈ కేసు మళ్ళీ మొదటికొచ్చింది కనుక మళ్ళీ మరో పదేళ్ళు విచారణ సాగినా ఆశ్చర్యం లేదు. అప్పటికి ఈ కేసు విచారణ చేపట్టబోయే న్యాయమూర్తులు కూడా పదవీ విరమణ చేసినా ఆశ్చర్యం లేదు.