యువ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ‘సిగ్మా’రెండో పాట విడుదలకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ‘ఓలమ్మో వగలాడి...’ అంటూ సాగే సెకండ్ సింగిల్‌ను బుధవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు యువన్ శంకర్ రాజా చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
మరో విశేషమేమిటంటే, తమిళనాడు సిఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కనుక తమిళనాడు ప్రజలు, కోలీవుడ్ ముఖ్యంగా విజయ్, సంగీత అందరూ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రంలో సందీప్ కిషన్‌కి జంటగా ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపి, మహాలక్ష్మి, షీలా రాజ్‌కుమార్, కమలేష్, కిరణ్ కొండ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సిల్వా; పాటలు: వివేక్, సూపర్ సుబ్బు; సంగీతం: థమన్ ఎస్. ; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్ ; కెమెరా: కృష్ణన్ వసంత్; వీఎఫ్‌ఎక్స్‌ప్రెస్: హరిహరసుతన్; యాక్షన్; వెంకట్ చేస్తున్నారు.
జేసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో సందీప్ కిషన్ మరోసారి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.