పళ్ళ బురుసుతో ఓ చక్కటి పాట హైలో హైలో హైలెస్సా

August 11, 2026


img

ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్న ‘పళ్ళ బురుసు’ ఈ నెల14న విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్ స్పీడ్ వరుసగా పాటలు విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి ‘హైలో హైలో హైలెస్సా.. అంటూ సురేష్ గంగుల వ్రాసిన చక్కటి పాట విడుదలైంది. పవన్ సీహెచ్ సంగీతం అందించిన ఈ పాటని శ్రీరాంచంద్ర, లక్ష్మీ మేఘన కలిసి చక్కగా పాడారు.   

ఈ సినిమాలో ప్రజ్వల్ యద్మ, గోమతి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.         

ఈ సినిమాకు రచన, దర్శకత్వం: ఉదయ్ చౌహాన్; పాటలు: సురేష్ గంగుల; సంగీతం: పవన్ సీహెచ్, కెమెరా: వినోద్ కె.బంగారి; ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి; కోరియోగ్రఫీ: విష్ణు ప్రిజర్వర్ చేశారు. 

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య పిట్టీ, వివేక్ క్రిష్ణాని కలిసి సిద్ధం చేసిన ఈ సినిమా  ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల కాబోతోంది.  


Related Post

సినిమా స‌మీక్ష