నేడు సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాశి’ నుంచి రెండు కొత్త పోస్టర్స్ విడుదల చేశారు.
‘వారణాశి’లో మహేష్ బాబు పాత్ర పేరు ‘రుద్ర.’ కానీ ఎల్లప్పుడూ రౌద్రంగా ఉండరంటూ మహేష్ బాబు చిల్ అవుతున్న స్టిల్ ఒకటి, పెద్ద జుత్తు, గడ్డంతో ఉన్న స్టిల్ మరొకటి సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేశారు. ఈ రెండు స్టిల్స్ ఆఫ్రికా షెడ్యూల్‌లో కిలిమంజారో, మసాయి మారా ప్రాంతాల్లో చిత్రీకరించిన సన్నివేశాల నుంచి ఎంపిక చేసినట్లు రాజమౌళి వెల్లడించారు.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
సూపర్ డూపర్ హిట్ ‘ఆర్‌ఆర్ఆర్’ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమా ఇది కనుక దీనిపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మరోసారి ధ్రువీకరించారు.
Another trip around the Sun… before we travel across time.
— Varanasi (@VaranasiMovie) August 9, 2026
Happy Birthday Rudhra 💙 @urstrulymahesh #Varanasi pic.twitter.com/Iqa3QLtHiR