ప్యారడైజ్ టీజర్‌లోనే ఇంత రక్తపాతమా!

August 06, 2026


img

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. టీజర్‌లో రక్తపాతం చూస్తే ప్యారడైజ్ ఇంత భయంకరంగా ఉంటుందా? అనిపిస్తుంది. నాని మాత్రం ఈ సరికొత్త పాత్రలో ఇమిడిపోయి అద్భుతంగా చేశారు.   

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని, కాయదు లోహర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.               

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: జీకే విష్ణు, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

‘దసరా’ సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ది ప్యారడైజ్ సెప్టెంబర్‌ 24 విడుదల చేయబోతున్నట్లు టీజర్‌లో ప్రకటించారు. 


Related Post

సినిమా స‌మీక్ష