పంద్రాగస్ట్ నుంచి కొత్త పించన్లు పంపిణీ

August 06, 2026


img

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 15 నుంచి కొత్తగా పించన్లు పంపిణీ చేయబోతోంది. ఇప్పటికే అర్హులను గుర్తించి వారి వివరాలు నమోదు చేసే ప్రక్రియ దాదాపు పూర్తయింది. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులకు నెలకు రూ.2,016 చొప్పున పించన్ అందించబోతోంది. అలాగే తలసేమియా, సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న రోగులకు కూడా ఈ పించన్లు అందించబోతోంది. 

ఆగస్ట్ 15న సిఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో జరిగే సభలో లాంచనంగా తెల్ల రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. కనుక అదే వేదికపై ఈ పించన్ల పంపిణీ కూడా చేసే అవకాశం ఉంది. అదేరోజున రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు అర్హులకు తెల్ల రేషన్ కార్డులతో పాటు పించన్లు కూడా పంపిణీ చేస్తారు.


Related Post