ప్రముఖ తెలుగు సినీ నటుడు నవదీప్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆయన నీట్ సమస్య ప్రస్తావించి, ‘”ప్రభుత్వానిది తప్పంటే యాంటీ నేషనలిస్ట్ అంటారు. స్టూడెంట్స్‌ది తప్పంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఒపీనియన్ చెబితే నీకేం తెలుసు అంటారు. చెప్పకపోతే నువ్వేం చేయలేదుగా.. ఎందుకంటారు. అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, డెమోక్రసీ అంటే ఏమిటి?” అని నవదీప్ ప్రశ్నించారు.
ఆయన దేశాన్ని కుదిపేస్తున్న ఈ సమస్య గురించి మాట్లాడుతూ, ఇలాంటి సందర్భాలలో సెలబ్రెటీలు స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉండిపోతారో చెప్పకనే చెప్పారు. నవదీప్ వీడియో చూస్తే ఈ విషయం మీకూ అర్ధమవుతుంది.
స్టూడెంట్స్ ఇష్యూపై నవదీప్ రియాక్షన్ వైరల్
— ChotaNews App (@ChotaNewsApp) July 25, 2026
నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల నిరసనపై నటుడు నవదీప్ స్పందించిన తీరు నెట్టింట వైరలవుతోంది. ‘‘ప్రభుత్వానిది తప్పంటే యాంటీ-నేషనలిస్ట్ అంటారు. స్టూడెంట్స్‌ది తప్పంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఒపీనియన్ చెబితే నీకేం తెలుసు అంటారు. చెప్పకపోతే… pic.twitter.com/0XPpGkOunK