ఐటి కంపెనీ ఎదుట మహిళా ఉద్యోగి ధర్నా!

July 23, 2026
img

మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్న భావన అనే ఉద్యోగినిని హటాత్తుగా ఉద్యోగంలో నుంచి తొలగించడంతో ఆమె ఆ కంపెనీ ఎదుట ధర్నాకి కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు కంపెనీ మేనేమెంట్ తనతో, సాటి ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరు గురించి వివరించారు. 

“నాకు ఆరోగ్యం బాగోలేక వైద్యం కోసం 13 రోజులు సెలవు పెడితే, మా మేనేజర్ రోజూ ఫోన్లు చేస్తూ డ్యూటీకి ఎందుకు రావడం లేదు? వెంటనే రాకపోతే ఉద్యోగంలో నుంచి పీకేస్తాను అంటూ బెదిరించేవారు తప్ప నీకు ఏమైంది? నీ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది? అని అడగలేదు. 

డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరైనా వాష్ రూమ్‌కి వెళ్ళాలన్నా గట్టిగా అందరికీ వినపడేలా మేనేజర్‌కి చెప్పి వెళ్ళాలనేవారు. మహిళా ఉద్యోగులు అలా చెప్పుకోలేక బయటకు వెళ్ళామని చెపితే ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఇటీవల మా పాపకి ఆరోగ్యం బాగోకపోవడంతో హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళాల్సి వచ్చింది. 

అదే విషయం నేను మా మేనేజర్‌కి చెప్పాను. కానీ అప్పుడు కూడా పాపకి ఏమైంది? ఎలా ఉందిప్పుడు? అని అడగకుండా డ్యూటీకి ఎప్పుడు వస్తావు? రాకపోతే ఉద్యోగంలో నుంచి పీకేస్తానంటూ బెదిరించేవారు. సోమవారం డ్యూటీకి వస్తే టెర్మినేషన్ లెటర్ చేతిలో పెట్టి పంపించేశారు. అందుకే న్యాయం కోసం పోరాడుతున్నాను,” అని అన్నారు. 

ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే... 

Related Post