కొమురవెల్లి స్టేషన్లో ఆగే రైళ్ళు ఇవే!

July 23, 2026
img

సిద్ధిపేట జిల్లా కొమురవెల్లిలో కొత్తగా నిర్మించిన 'కొమురవెల్లి పుణ్యక్షేత్రం’ రైల్వే స్టేషన్ ఈ నెల 26న ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే స్టేషన్‌ కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్లో ఆగే రైళ్ళు, వాటి ప్రయాణ సమయాలు ప్రకటించింది.

సిద్ధిపేట నుంచి సికింద్రాబాద్‌ డెమో రైలు (ట్రైన్ నం. 77654): ఇది కొమురవెల్లి రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 2.38 గంటలకు వస్తుంది. రెండున్నర నిమిషాల హాల్ట్ తర్వాత బయలుదేరుతుంది. 

సికింద్రాబాద్‌ నుంచి సిద్ధిపేట డెమో రైలు(ట్రైన్ నం.77655): ఇది రాత్రి 8.04 గంటలకు కొమురవెల్లి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. బుధవారం తప్ప వారంలో మిగిలిన ఆరు రోజులు ఈ డెమో రైలు నడుస్తుంది.

సిద్ధిపేట నుంచి సికింద్రాబాద్‌(ట్రైన్ నం.77656): ఇది ఉదయం 7.04 గంటలకు కొమురవెల్లి రైల్వే స్టేషన్ చేరుకొని రెండున్నర నిమిషాల హాల్టింగ్ తర్వాత బయలుదేరుతుంది. 

సికింద్రాబాద్‌ నుంచి సిద్ధిపేట(ట్రైన్ నం. 77653): ఇది మధ్యాహ్నం 12.52 గంటలకు కొమురవెల్లి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఇది కూడా బుధవారం తప్ప వారంలో మిగిలిన ఆరు రోజులు నడుస్తుంది.

Related Post