నటుడు జూ.ఎన్టీఆర్ పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘రా ఎన్టీఆర్’ పై ఇటీవల వివాదాలలో చిక్కుకోవడంతో ఆ సంస్థ నిర్వాహకులు దానిని తక్షణం మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇంతకాలం తమతో కలిసి పని చేసినవారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఇటీవల ఆ సంస్థ నిర్వాహకులు తిరుపతిలో ప్రెస్‌మీట్ పెట్టి ‘రా ఎన్టీఆర్’ గురించి వివరిస్తూ జూ.ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలు బ్యాక్ ఫైర్ అయ్యాయి. ఆ తర్వాత ‘రా ఎన్టీఆర్’ దాని నిర్వాహకులపై మరిన్ని విమర్శలు వచ్చాయి.
జూ.ఎన్టీఆర్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే దానికీ ఈవిధంగా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో, బహుశః వాటిని భరించలేక లేదా భరించాల్సిన అవసరం లేదని భావించినందునో నిర్వాహకులు ఈ సంచలన నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.
కానీ జూ.ఎన్టీఆర్ స్వయంగా వద్దని చెప్పినప్పుడు ‘రా ఎన్టీఆర్’ కార్యకలాపాలు కొనసాగించడం సబబు కాదు. కనుక వారి నిర్ణయం సరైనదే.
ఒకవేళ వారికీ సమాజసేవ చేయాలనుకుంటే తమ సొంత పేరుతో లేదా మహనీయుల పేరుతోనో చేసుకోవచ్చు. అప్పుడు అందరూ హర్షిస్తారే తప్ప ఎవరూ ఈవిధంగా వేలెత్తి చూపరు.