అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఇరాన్ చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
అమెరికా తమ మౌలిక వసతులపై దాడులు కొనసాగిస్తే, తాము కూడా ఈసారి అమెరికాపై 9/11 తరహా దాడులు చేసేందుకు వెనకాడమని, అప్పుడు అమెరికా మరోసారి జాతీయ సంతాప దినాలను పాటించాల్సి వస్తుందని ఇరాన్ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది.
ఐఆర్జీసీ చేసిన ఈ హెచ్చరికపై అమెరికాతో సహా యావత్ ప్రపంచదేశాలు ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఒక్క ప్రకటన ఇప్పుడు ఇరాన్‌ని అమెరికా ఉపేక్షించలేని పరిస్థితి కల్పించినట్లయింద అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఏవిధంగా అంటే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణ్వాయుధ శక్తిని నిర్వీర్యం చేయడమే లక్ష్యమంటూ యుద్ధం ప్రారంభించారు. కానీ మద్యలో హర్మూజ్ జలసంధి వ్యవహారంలో చిక్కుకొని దారి తప్పారు.
కానీ ఇప్పుడు అమెరికా మీద 9/11 తరహా దాడులు చేస్తామని ఇరాన్ చేసిన ఈ ఒక్క హెచ్చరికతో, అమెరికా భద్రతకు ఇరాన్ పెను ప్రమాదకరమని వాదించేందుకు, ఈ యుద్ధం మరింత తీవ్రం చేసేందుకు ఇప్పుడు ట్రంప్‌కి అవకాశం లభించినట్లయింది.
కనుక ఇరు దేశాల మధ్య యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది యావత్ ప్రపంచ దేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.