గణేష్ నిమజ్జనాలపై ఎటువంటి ఆంక్షలు లేవు: రంగనాథ్

September 10, 2026
img

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులతో సహా స్థానికంగా అన్ని చెరువులలో గణేశ్ నిమజ్జనాలు జరుపుకోవచ్చని తెలిపారు. గణేశ్ నిమజ్జనాలకు అనుమతి లేదంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. 

దేఅమీన్ పూర్ చెరువుని దేశంలో బయోడైవర్సిటీగా గుర్తింపు లభించింది. అలాగే సహజ సిద్ధమైన వెట్ ల్యాండ్ కింద కాప్రా చెరువుని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, ప్రస్తుతం కాప్రా చెరువులో నీళ్ళు కూడా లేవు. కనుక ఈ రెండు చెరువులు  మినహా నగరంలోని మిగిలిన అన్ని చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలు యథావిధిగా జరుపుకోవచ్చని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. 

చిన్న విగ్రహాల నిమజ్జనం కోసం ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక చెరువులను ఉపయోగించుకోవాలని సూచించారు. 

నగరంలో గణేశ్ నిమజ్జనాల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నగరంలోని మొత్తం 103 చెరువుల వద్ద 51 డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లు, 394 మంది శిక్షణ పొందిన గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. కనుక వదంతులు నమ్మవద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Related Post