మువ్వన్నెలతో మెరిసిన బుర్జ్ ఖలీఫా టవర్స్

April 15, 2026
img

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా టవర్స్ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మువ్వన్నెల వెలుగులతో మెరిసిపోయింది. దుబాయ్ కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల 50 నిమిషాలకు బుర్జ్ ఖలీఫా భవనాన్ని భారత జాతీయ పతాకం రంగులైన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల ఎల్‌ఈడీ లైట్లతో అద్భుతంగా ప్రదర్శించారు. 

ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించడానికి దుబాయ్‌లో నివసిస్తున్న భారతీయ వలసదారులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో బుర్జ్ ఖలీఫా ప్రాంగణానికి చేరుకున్నారు. భవనంపై భారత త్రివర్ణ పతాకం ప్రత్యక్షం కాగానే అక్కడున్న భారతీయులందరూ, తీవ్ర భావోద్వేగంతో ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. ఈ అద్భుతమైన దృశ్యాలను వారు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రత్యేక ప్రదర్శన భారత్ మరియు యూఏఈ దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్య సంబంధాలకు, స్నేహ బంధానికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. 

Related Post