ఫిరాయింపు విచారణ మరోసారి వాయిదా

July 22, 2026


img

బీఆర్ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి  ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్, బీజేపీలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిపింది. 

విచారణ సందర్భంగా ప్రతివాద ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేసేందుకు మరింత సమయం కావాలని కోర్టును కోరారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను ఆగస్టు 12కు వాయిదా వేసింది. తదుపరి విచారణ నాటికి అవసరమైన పత్రాలు, కౌంటర్లు దాఖలు చేయాలని సంబంధిత పక్షాలకు సూచించింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ తిరస్కరించడంతో పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. 

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దాదాపు రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ విచారణ ఎప్పటికి ఏవిధంగా ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. 


Related Post