ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ తాను నిజామాబాద్ జీవితంలో కూడా కట్టప్పనే అని చెప్పారు. అయితే ఈ కట్టప్ప డీఎంకే పార్టీకి శ్రేయోభిలాషి అని చెప్పారు. చెన్నైలోని కళైంజర్ కంప్యూటర్ విద్యా కేంద్రం, మహిళల నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నేను డీఎంకే పార్టీలో లేను. ఆ పార్టీ కార్యకర్త కూడా కాదు. కానీ సామాజిక సేవ కోసమే పుట్టిన ఆ పార్టీకి శ్రేయోభిలాషి కట్టప్పలాంటివాడిని. డీఎంకే సిద్ధాంతాలు, ద్రవిడ ఉద్యమం పట్ల ఉన్న దాని వైఖరి నేను ఆ పార్టీని అభిమానించేలా చేసింది. ఆ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సామాజిక సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం గట్టిగా కృషి చేయాలని కోరుతున్నాను,” అని సత్యరాజ్ అన్నారు.
సత్యరాజ్ ఒక ఉద్దేశ్యంతో ఈ మాట అంటే ఆయన డీఎంకేకి వెన్నుపోటు పొడవాలనుకుంటున్నట్లు తమిళనాడు ప్రజలకు వేరే విధంగా చేరుతోంది. కనుక మళ్ళీ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోక తప్పదేమో?