క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో విడుదలైన ‘ది ఒడిస్సీ’ మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2,000 కోట్లు కలెక్షన్స్ సాధించి దూసుకుపోతోంది. భారత్‌లో కూడా దీని హవా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే రూ.7.78 కోట్లు వసూలు చేసింది. భారతీయ సినిమాలు భారత్ ఈ మాత్రం వసూళ్ళు సాధించలేక తడబడుతుంటే హాలీవుడ్ సినిమా ది ఒడిస్సీ మొదటి వారంలోనే రూ.64.58 కోట్లు (నెట్) వసూళ్ళు సాధించి దూసుకుపోతోంది.
ఈ సినిమా ఘన విజయం సాధించడంతో చిత్ర బృందం ఒక ఫన్నీ వీడియో రిలీజ్ చేసింది. దానిలో ట్రోజన్ వార్ ముగిసిన తర్వాత ఒడిస్సియస్ తన సైన్యంతో కలిసి పడవలో ‘ఇథాక’కు తిరుగు ప్రయాణం అవుతాడు. అప్పుడు ఓ సైనికుడు త్వరగా స్వదేశం చేరుకునేందుకు ఇది పనికివస్తుంది అంటూ ఓ మ్యాప్ అతని చేతిలో పెడతాడు. కానీ ఒడిస్సియస్ దానిని సముద్రంలో విసిరేసి జేబులో నుంచి మొబైల్ ఫోన్ బయటకు తీసి దానిలో ‘గూగుల్ మ్యాప్’ ఉందని గర్వంగా చూపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూసి తీరాల్సిందే.
The real reason Odysseus took 10 years to get home pic.twitter.com/nFrbCZeXq0
— newzy.com (@realnewzy) July 20, 2026