చిరంజీవి సినిమా టైటిల్‌ కాకాజీ?

July 19, 2026


img

మెగాస్టార్ చిరంజీవికి ‘వాల్తేర్ వీరయ్య’ వంటి సూపర్ హిట్ అందించిన మాస్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 158వ సినిమా అప్‌డేట్‌ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వారికి ఓ శుభవార్త ఈ సినిమాకి ‘కాకాజీ’అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో చిరంజీవి కూతురుగా అనశ్వర రాజన్, నివేతా పెతురాజ్, శరత్ కుమార్‌ ఓ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. 

మల్లాది వశిష్ట దర్శకత్వం చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ ‘విశ్వంభర’ ఈ ఏడాది అక్టోబర్ 16న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిషనటించగా, ఆషికా రంగనాథ్ ఓ ముఖ్యపాత్ర చేశారు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.


Related Post

సినిమా స‌మీక్ష