మందాకిని నవ్వితే నిండుగా లేకుంటే అగ్నికణం

July 18, 2026


img

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో సిద్దమవుతున్న ‘వారణాశి’ నుంచి చిన్న అప్‌డేట్‌ వచ్చినిడ్. అది కూడా రాజమౌళి స్వయంగా ఇవ్వడం విశేషం.ఈ సినిమాలో మందాకినిగా నటిస్తున్న ప్రియాంక చోప్రా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వారణాశిలో ఆమె రెండు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ‘మందాకిని నవ్వితే నిండుగా లేకుంటే అగ్నికణం,’ అంటూ ఆమె పాత్రలో మరో కోణం పరిచయం చేశారు. రాజమౌళి షేర్ చేసిన ఈ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ కొత్త స్టిల్స్‌లో ప్రియాంక లుక్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. గతంలో విడుదలైన సంప్రదాయ చీర లుక్‌తో పోలిస్తే ఈసారి మరింత రఫ్ అండ్ టఫ్‌గా కనిపించింది. 

ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర'గా, మళయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' విలన్‌గా నటిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణలో మందాకిని కీలకమని సమాచారం. 

వారణాశి షూటింగ్‌ మరో రెండు మూడు నెలల్లో ముగుస్తుందని రాజమౌళి స్వయంగా చెప్పారు. ఈ సినిమా 2027 ఏప్రిల్‌లో  ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

వారణాశి విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, రాజమౌళి ఒక్కో క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ సినిమాకి బాగానే హైప్ సృష్టిస్తున్నారు. రాజమౌళి సినిమాలో ప్రతి పోస్టర్‌తో కథ చెప్పకుండా పాత్ర గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం ఆయన ప్రత్యేకత, ఇదొక రకం మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా. 


Related Post

సినిమా స‌మీక్ష