సైదాబాద్ స్కూల్ కల్మా వివాదం.. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

July 17, 2026


img

హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో సక్సస్ స్కూల్ ‘కల్మా’ వివాదంపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఓ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధికి ఇస్లాం మతానికి చెందిన ‘కల్మా’, ‘సూరహ్ ఫతీహా’ చదువుకొని రావాలని క్లాస్ టీచర్ హోంవర్క్ ఇవ్వడంతో ఆ బాలుడి తల్లితండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీనిపై బిజేపి, హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  స్కూల్ వద్ద ఆందోళనలు చేపట్టారు. స్కూల్ యాజమాన్యం ఆ ఉపాధ్యాయురాలిని వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

కానీ ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా వెళ్ళడంతో దీనికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, విద్యాశాఖ డైరెక్టర్‌కి, నగర పోలీస్ కమీషనర్‌కి నోటీసులు పంపింది. 

ఇది పిల్లల హక్కులకు సంబంధించిన తీవ్రమైన అంశంగా పరిగణించాల్సి ఉంటుందని కమిషన్ అభిప్రాయపడింది. విద్యార్థుల మత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందనే ఆరోపణలు నిజమైతే, తగిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 


Related Post