ఇస్రో శాస్త్రవేత్తలు మూకుమ్మడి రాజీనామాలు?

July 17, 2026
img

అంతరిక్ష రంగం ప్రయోగాలు, పరిశోధనలలో భారత్‌ని అగ్ర దేశాల సరసన నిలిపిన ఘనత ఖచ్చితంగా ఇస్రో శాస్త్రవేత్తలదే. కానీ ఇప్పుడు వారే వివిధ కారణాలతో రాజీనామాలు చేయడమో లేదా స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. 

ఇస్రో దానికి అనుబందంగా పనిఇస్రో టెలిమెట్రీ, ఎన్‌ఆర్‌ఎస్సీ, దేశంలోని శ్రీహరికోట, తిరువనంతపురం, బెంగళూరు తదితర అంతరిక్ష ప్రయోగ కేంద్రాలలో పనిచేస్తున్న సుమారు 120 మంది వరకు సీనియర్ శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. 

వీరిలో చాలా మంది ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘గగన్ యాన్’, ‘చంద్రయాన్-3’, ‘చంద్రయాన్-4’ వంటి కీలక ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. కనుక వీరి రాజీనామాలతో ఆయా ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. ఇస్రోలో రాజీనామాలు కొత్తేమీ కాకపోయినా ఒకేసారి ఇంతమంది శాస్త్రవేత్తలు రాజీనామాలకు సిద్దపడటం చాలా ఆలోచింపజేసే విషయమే.

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగాన్ని అనుమతించడం వారి రాజీనామాలకు కారణమని తెలుస్తోంది. కానీ ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కనుక వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలని, తొందరపడి ఎవరి రాజీనామాలు ఆమోదించవద్దని అంతరిక్షశాఖ ఇస్రో చైర్మన్‌, ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. 

Related Post