రాబోయే మూడు రోజులు వర్షాలే

July 16, 2026
img

తెలంగాణలో రేపటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయవ్య బంగాలాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

తెలంగాణలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్‌, కామారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, సిద్ధిపేట, మెదక్ జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related Post