దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్ళు పరుగులు తీస్తున్నాయి. వాటికి అపూర్వమైన ప్రజాధరణ లభిస్తోంది. అయితే వాటిలో నిద్రించేందుకు బెర్తులు లేకపోవడంతో కూర్చొనే ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. ఈ లోటుని తీరుస్తూ భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ రైళ్ళను ప్రవేశపెడుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వందే భారత్ స్లీపర్ రైలుని ప్రారంభించనున్నారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పంజాబ్‌లోని ఛెహర్తా (అమృత్‌సర్ సమీపం) వరకు రాకపోకలు సాగిస్తుంది.
ఇది కూడా వందే భారత్ రైళ్ళ వేగంతోనే ప్రయాణిస్తుంది. సాధారణ స్లీపర్ రైళ్ళతో పోలిస్తే దీనిలో మరింత మెరుగైన ఆధునిక సదుపాయాలు, భద్రత ఉంటాయి.
దీనిలో నిద్రించేందుకు చక్కటి బెర్తులు ఉన్నందున రాత్రి వేళ్ళలో కూడా నడిపించబోతున్నట్లు సమాచారం.