తమిళనాడు సిఎం విజయ్ చివరిగా నటించిన ‘జన నాయకన్’ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ చాలా భారీ బడ్జెట్‌తో 'జన నాయకన్'ని తెరకెక్కించింది. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెప్పడంతో ఆగిపోయింది. ఇప్పుడు విజయ్ నిజామాబాద్ జీవితంలో కూడా ‘జన నాయగన్’ అయిన తర్వాత రిలీజ్ అవుతోంది.
ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించగా, బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమిత బైజు, ప్రియమణి, నరేన్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
ప్రస్తుతం విజయ్ తమిళనాడు సిఎంగా వ్యవహరిస్తున్నారు కనుక ఈ సినిమా హిట్ అయితే అయన పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. కానీ ఫ్లాప్ అయితే ఆ సినిమాని, ఆయన ప్రభుత్వాన్ని పోల్చుతూ విమర్శలు తప్పవు.