మెగాస్టార్ చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ పూర్తయ్యి చాలా కాలమే అయ్యింది. కానీ అనివార్య కారణాల వలన ఇంతవరకు విశ్వంభర విడుదల చేయలేకపోయారు. ఇలాగే కూర్చుంటే చూస్తుండగానే ఈ ఏడాది కూడా గడిచిపోతుంది. కనుక విశ్వంభరని ఈ దసరా పండుగకు అంటే అక్టోబర్ 16న తప్పకుండా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కనుక త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
మల్లాది వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిషనటించగా, ఆషికా రంగనాథ్ ఓ ముఖ్యపాత్ర చేశారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.