అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’ లో రష్మిక మందన కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పడుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇలాంటి సినిమాలో నలుగురు హీరోయినలు దేనికి అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో సమాధానం కనిపించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు పాత్రలు చేయబోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు కాదు నాలుగు పాత్రలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాత, తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రలు అల్లు అర్జున్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం అల్లు అర్జున్‌కి లుక్ టెస్ట్ చేయగా చాలా బాగుండటంతో నాలుగు పాత్రలకి ఆయననే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటన వెలువదితే నాలుగు పాత్రలు చేస్తున్నారా లేక రెండు పాత్రలకే పరిమితమా? తెలుస్తుంది. నలుగురు హీరోయిన్లు అనుకుంటున్నారు కనుక నాలుగు పాత్రలు చేయబోతున్నట్లే భావించవచ్చు.
రాకాలో సీనియర్ నటి రమ్యకృష్ణ, బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా షూటింగ్ పూర్తి చేసి 2027 వేసవిలో రాకా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సుమారు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో 9 భారతీయ భాషల్లో రాకా నిర్మిస్తున్నారు.