జానకమ్మ పాదాల వద్ద కూర్చొని పాడాను: సింగర్ సునీత

July 12, 2026


img

ప్రముఖ నేపధ్య గాయని, సంగీత దర్శకురాలు, పాటల రచయిత్రి ఎస్ జానకి మృతి పట్ల గాయని సునీత తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. ఈ ఏడాది మార్చిలో చెన్నైలోని ఆమె ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఆమె కోరిక మేరకు ఆమె పాదాల వద్ద కూర్చొని పాట పాడితే ఆమె నా పాటకి తాళం వేస్తూ చాలా సంతోషించారు.

కానీ ఇంతలోనే ఆమె ఇక లేరని తెలిసి దిగ్బ్రాంతి చెందాను. సంగీత ప్రపంచంలో ఆమె లేని ఈ లోటు మరెవరూ తీర్చలేరన్నారు. సింగర్ సునీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియో పోస్ట్ చేసి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. 

జానకమ్మ ఒకటీ రెండూ కాదు 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె ఏ భాషలో పాట పాడిన చక్కటి స్వరంతో పాటలో సాహిత్యం, పదాల ఉచ్చారణతో పాడేవారు. కనుకనే ఆమెను అందరూ ఓన్ చేసుకుంటారు. 


Related Post

సినిమా స‌మీక్ష