భారతీయ సినీ పరిశ్రమలో రామాయణ, మహాభారత గాధలను ఇప్పటివరకు ఎంతమంది ఎన్నిసార్లు సినిమాలుగా, టీవీ సీరియల్స్‌గా తీశారో లెక్కేలేదు. అయినా మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉన్నారు. తీసిన ప్రతీసారి ప్రజలు చూసి ఆస్వాదిస్తూనే ఉన్నారు.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో మరోసారి రామాయణం ఆధారంగా ‘రామాయణ’ సిద్దం అవుతోంది.
దీనిలో రణబీర్ కపూర్ శ్రీరాముడుగా, సాయిపల్లవి సీతమ్మవారిగా, రవి దుబే లకష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, కన్నడ నటుడు యష్ రావణుడుగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు కధ: శ్రీధర్ రాఘవన్, దర్శకత్వం: నితీష్ తివారీ, సంగీతం: ఏఆర్ రహమాన్, హాన్స్ జిమ్మర్, వీఎఫ్ఎక్స్: డిఎన్ఈజీ (8సార్లు ఆస్కార్ అవార్డ్ గ్రహీత).
హనుమాన్ జయంతి నాడు విడుదల చేసిన టీజర్ అద్భుతంగా ఉంది. కనుక అందరూ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. వారికి చిత్ర బృందం ఆ శుభవార్త చెప్పింది. జూలై 24న రామాయణ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
రామాయణ మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేస్తామని ముందే ప్రకటించారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.