‘మైసా’ కోసం రష్మిక అంత సాహసం చేశారా!

July 10, 2026


img

విజయ్ దేవరకొండ, రష్మిక మందనల  పెళ్ళి తర్వాత ఇద్దరూ సినిమాలకు బ్రేక్ ఇచ్చి హనీమూన్‌కి వెళతారనుకుంటే, ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. హనీమూన్‌లో వైవాహిక జీవితంలో మధుర క్షణాలు ఆస్వాదించాల్సిన ఈ సమయంలో రష్మిక తను ప్రధాన పాత్ర చేస్తున్న ‘మైసా’ కోసం ఇటీవలే బ్యాంకాక్‌లో హ్యాండ్-టూ- హ్యాండ్ ఫైటింగ్‌లో శిక్షణ పొంది తిరిగి వచ్చారు. 

తాజాగా ‘మైసా’లో నీటి అడుగున కొన్ని ఫైటింగ్ సన్నివేశాలలో ఆమె స్వయంగా నటించారు. ఇలాంటి సన్నివేశాలలో హీరోలే డూప్‌లతో కానిచ్చేస్తుంటారు. కానీ రష్మిక మాత్రం డూప్ వద్దని చెప్పి స్వయంగా నీటి అడుగున తీసిన ఈ సన్నివేశాలలో నటించారు. 

ఈ సన్నివేశాలను చిత్రీకరించడానికి రెండు రోజులలో సుమారు 20 గంటలు పట్టింది. రోజుకి అనేకసార్లు ఆమె నీటి అడుగున షూటింగ్‌ చేసే ఈ సన్నివేశాలలో పాల్గొనడం చూసి యూనిట్ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. 

ఈ సినిమాలో గిరిజన పోరాట యోధురాలు మైసాగా రష్మిక మందన నటిస్తున్నారు. కనుక ఈ పాత్రకు తగ్గట్లుగా తన శరీరాకృతిని మార్చుకునేందుకు వ్యాయామాలు కూడా చేస్తున్నారు. రష్మిక సినిమా కోసం ఎంతైనా శ్రమించడానికి వెనకాదారని మరోసారి నిరూపించి చూపారు.   

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవీంద్ర పుల్లె, సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా:శ్రేయాస్ కృష్ణ, స్టంట్స్: అండీ లాంగ్ చేస్తున్నారు.  

అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోపా కలిసి మైసాని పాన్‌ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష