లెనిన్ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది

July 09, 2026


img

అఖిల్ అక్కినేని చాలా నమ్మకంతో చేసిన సినిమా లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్‌, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లెనిన్ రేపు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సెన్సార్ రిపోర్ట్ కూడా చేతికి వచ్చేసింది కనుక ఇక ఎటువంటి ఆలస్యం ఉండదు. 

ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్‌ 2 గంటల 35 నిమిషాలు.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు, సంగీతం: తమన్, కెమెరా: లియాన్ బ్రిట్టో, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

మనం ఎంటర్‌ప్రైజస్, సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించిన లెనిన్ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.



Related Post

సినిమా స‌మీక్ష