భయపడేందుకు సిద్దంగా ఉన్నారా? అగధ

July 09, 2026


img

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర చేస్తున్న ‘అగధ’ నుంచి మరో పోస్టర్‌ విడుదలైంది. ఈ మిస్టికల్ డివైన్ థ్రిల్లర్‌లో ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త భయాన్ని చూడబోతున్నారు. థియేటర్లలో మెయిన్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం రెడీగా ఉండండి,” అంటూ అగధ మామూలు సినిమా కాదని చెప్తున్నారు.  

ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో కూడా భూతప్రేతాలు, అతీంద్రియ శక్తులను చూపారు. ఇప్పుడీ పోస్టర్ వేసి మరీ   చిత్ర బృందం హెచ్చరించింది.      

‘అగధ’లో శ్రావణ్ రెడ్డి, ఉల్క గుప్తా, జోవిక విజయ్‌ కుమార్‌, భాను చందర్, తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి సంగీతం: మిక్కిన్ అరుల్ దేవ్, కెమెరా: నాని చమిడిశెట్టి, ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ, అడిషనల్ స్క్రీన్ ప్లే: చైతన్య వేగి చేశారు. 

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బలుసు కాశీ విశాలాక్షి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అగధ నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని ప్రకటించారు. 


Related Post

సినిమా స‌మీక్ష