అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తుర్కియే జరుగుతున్న నాటో సదస్సులో పాల్గొన్న ట్రంప్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్ మాపై దాడులు చేస్తోంది. కనుక బుధవారం రాత్రి ఇరాన్ మీద భీకర దాడులు చేయబోతున్నాము. ఇది వారు ఎన్నటికీ మరిచిపోలేని కాళరాత్రిగా మిగిలిపోతుంది,” అని అన్నారు.
ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై ఇరాన్ కూడా ధీటుగానే స్పందించింది. మా దేశంపై జరుగుతున్న ఈ దాడులను ఎలా తిప్పి కొట్టాలో మాకు బాగా తెలుసు. అలాగే వీటికి తగిన ప్రతీకారం తీర్చుకుంటాము,” అని స్పష్టం చేసింది. ఇప్పటికే బహ్రెయిన్‌తో సహా అమెరికా సైనిక స్థావారాలున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది.
అమెరికా ఈ యుద్ధం మొదలుపెట్టినప్పటికీ దాని ముగింపు తమ చేతిలోనే ఉందని ఇరాన్ ఇదివరకు చెప్పింది. అది నిజమేనని అమెరికాని మళ్ళీ యుద్ధంలోకి రప్పించడంతో నిరూపిస్తోంది.