అమెరికా-ఇరాన్‌ యుద్ధం మళ్ళీ షురూ!

July 08, 2026
img

అమెరికా-ఇరాన్‌ మద్య కాల్పుల విరమణ శాంతి ఒప్పందం జరిగి నెల రోజులు కూడా పూర్తి కాలేదు. కానీ మళ్ళీ వాటి మద్య భీకర స్థాయిలో యుద్ధం మొదలైంది. నిజానికి అవి శాంతి ఒప్పందంపై సంతకాలు చేస్తున్నప్పుడే వాటి మద్య ఏకాభిప్రాయం లేదు. సయోధ్య ఏర్పడలేదు. అప్పుడే పరస్పరం విమర్శించుకున్నాయి. కనుక ఆ ఒప్పందానికి అవి కట్టుబడి ఉంటాయనే నమ్మకం ఎవరికీ కలుగలేదు. అదే నిజమైంది. 

అమెరికా, ఇరాన్‌ పరస్పర దాడులు చేసుకుంటూ మళ్ళీ యుద్ధం మొదలుపెట్టాయి. ఇరాన్‌ కీలక స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుంటే, దానికి తమ భూభాగాలు ఇచ్చిన గల్ఫ్ దేశాలపై, హోర్మూజ్ జలసంధిలో రవాణా నౌకలపై ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. 

మళ్ళీ మొదలైన యుద్ధం, దాని తీవ్రత గమనిస్తే ఇరు దేశాలు ఇప్పట్లో తగ్గేలా లేవు. ఎవరి మధ్యవరిత్వాన్ని అంగీకరించేలా లేవు. కనుక భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు మళ్ళీ గ్యాస్, చమురు సంక్షోభం తప్పకపోవచ్చు.

Related Post