ఈ ఏడాది ఫిభ్రవరి 28న అమెరికా దళాలు ఇరాన్ మీద దాడి చేసి యుద్ధం మొదలుపెట్టాయి. ఆ యుద్ధం తమకు ‘వీకెండ్ పిక్నిక్’ వంటిదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఆ పిక్నిక్ ముగియడానికి దాదాపు నాలుగు నెలలు పట్టింది.
అమెరికా-ఇరాన్ మద్య శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచదేశాలు ఊపిరి తీసుకున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో ఇబ్బందిపడుతున్న భారత్‌కు ఇది చాలా ఉపశమనం కలిగించే విషయమే. కానీ అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసిందనుకునేలోగా మళ్ళీ రష్యా-ఉక్రెయిన్ మద్య యుద్ధం భీకర స్థాయిలో ప్రారంభమైంది.
నాలుగేళ్ళ క్రితం ఫిభ్రవరి 26న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసి యుద్ధం మొదలుపెట్టింది. మద్యలో కాస్త జోరు తగ్గినప్పటికీ అప్పటి నుంచి ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈసారి ఉక్రెయిన్ వందల డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కోలో కీలక ప్రాంతాలపై భీకర దాడులు చేసింది.
ఉక్రెయిన్ నుంచి సుమారు 500 డ్రోన్లు ఒకేసారి తమ దేశంపై దాడికి ప్రయత్నిస్తే తమ రక్షణ వ్యవస్థ వాటిని సమర్ధంగా తిప్పికొట్టిందని రష్యా ప్రకటించింది. కనుక నేదో రేపో రష్యా కూడా ఉక్రెయిన్‌పై అంతకంటే భీకరంగా దాడులు చేయడం ఖాయం.
ఈ రెండు దేశాల మద్య యుద్ధం మొదలైతే మళ్ళీ ఆ ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారత్‌పై కూడా పడే ప్రమాదం పొంచి ఉంటుంది.