సమావేశం నుంచి ట్రంప్‌ పారిపోయిన తర్వాత ఏం జరిగిందంటే...

April 26, 2026
img

వైట్‌హౌస్‌ సమీపంలో హిల్టన్ హోటల్లో కాల్పులు జరగ్గానే భద్రతా సిబ్బంది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సహా ప్రముఖులను అక్కడి నుంచి హడావుడిగా సురక్షిత ప్రాంతానికి తరలించారు. వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్ డిన్నర్ మీటింగ్ జరుగుతునప్పుడు ఈ ఘటన జరిగింది. 

భద్రతా సిబ్బంది కాల్పులు జరిపిన కోలో టామోస్ అలెన్ (33)ని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఇక్కడితో ఈ కథ ముగిసినట్లేనని అందరూ భావించడం సహజమే. కానీ తర్వాత మరి కొంత జరిగింది. 

కోలో టామోస్ అలెన్ హటాత్తుగా కాల్పులు జరిపినప్పుడు ఈ సమావేశానికి హాజరైన అతిధులు అందరూ భయంతో టేబిల్స్ కింద దాక్కున్నారు. 

కానీ భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నాక అందరూ షాక్ నుంచి తేరుకొని ఎదురుగా బల్లలపై అతిధుల కోసం పెట్టిన ఖరీదైన లిక్కర్, రుచికరమైన ఆహార పదార్ధాలపై వారి దృష్టి పడింది. అంతే అందరూ కూర్చోని తాపీగా తాగినంత తాగారు. తిన్నంత తిన్నారు. మరి కొంతమంది ఖరీదైన లిక్కర్ బాటిల్స్ తీసుకుపోయారు!

మన దేశంలో ఎక్కడైనా కూరగాయలు, పెట్రోల్, డీజిల్, మద్యం రవాణా వాహనాలు బోర్లా పడితే చుట్టుపక్కల ప్రజలు పరుగున వచ్చి పట్టుకుపోతుంటారు. అది అనాగరికత అయితే మరి ఇదేమిటి?     

Related Post