రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాశి’ నుంచి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. దీనిలో మహేష్ బాబు శ్రీరాముడుగా నటిస్తున్నారని రాజమౌళి స్వయంగా చెప్పారు. దీనిలో శ్రీరాముడికి కుంభ కర్ణుడుకి మద్య ఓ యుద్ధం సీన్ ఉంటుందని ఇటీవలే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చిన్న లీక్ ఇచ్చారు.
ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లోనే ఆ సన్నివేశం చూపినప్పటికీ ఆ వ్యక్తి కుంభ కర్ణుడని బహుశః ఎవరూ ఊహించి ఉండరు. వారణాశిలో వారిద్దరి మద్య జరిగే ఈ ఒక్క యుద్ధ సన్నివేశం కోసమే రూ.85 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. కనుక వారణాశిలో ఇది హైలైట్ కావచ్చు.
అయితే శ్రీరాముడు రావణుడితో పోరాడి అంతమోదించడం అందరికీ తెలుసు. కానీ రాజమౌళి రాముడు-కుంభకర్ణుడు మాయ యుద్ధాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? అనే అనుమానం కలగడం సహజం.
వారణాశి టైమ్ ట్రావెల్ అడ్వంచర్. దీనిలో త్రేతాయుగంలో కుంభకర్ణుడే కలియుగంలో విలన్ కుంభ (పృద్విరాజ్ సుకుమారన్)గా మళ్ళీ పుట్టినందునే ఈ యుద్ధ సన్నివేశం పెట్టి దానిపై ఇంత ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, పృద్విరాజ్ సుకుమారన్, బాలీవుడ్ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ: విజయేంద్ర ప్రసాద్, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్,వీఎఫ్ఎక్స్: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్, మోహన్ నాథ్ బింగి చేస్తున్నారు.
ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి సుమారు రూ.1,100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న వారణాశి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.