నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సంఘీభావం తెలిపారు.
నేడు హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, “మోడీగారు మీరు ఎవరితో ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారు. విద్యార్ధులతో పెట్టుకొని కొరివితో తల గోక్కుంటున్నారు. తరం మారుతోంది. స్వరం మారుతోంది. రాజ్యమా ఉలిక్కి పడు. జాగ్రత్తగా ఉండు.
విద్యార్ధులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. శ్రీలంక, నేపాల్ ప్రభుత్వాలు ఇలాగే కుప్పకూలాయి. కనుక మోడీగారు జెన్-జీ పెట్టుకోవద్దు. జాగ్రత్తపడండి. మీ వాట్సప్ బ్యాచ్ ఈ జెన్-జీ సోషల్ మీడియా బ్యాచ్‌ని తట్టుకొని నిలబడలేదు. కొరివితో తల గోక్కోవద్దు మోడీ గారు,” అంటూ కేటీఆర్ హెచ్చరించారు.
“ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనం వహిస్తోంది? బిజేపితో రహస్య అవగాహన ఉన్నందునేనా?” అంటూ సిఎం రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ కూడా అంతే దీటుగా జవాబిచ్చారు.
“నేను మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బయలుదేరితే, రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? నేను మోడీని ప్రశ్నిస్తే మధ్యలో ఆయనకెందుకు అభ్యంతరం? అంటే వారిద్దరూ బడే మియ్యా, చోటే మియ్యా వంటివారు కనుకనే,” అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

రాజ్యమా ఉలికిపడు..

తరం మారుతున్నది,
స్వరం మారుతున్నది,
నవతరం పంథా మారుతున్నది,

నువ్వు ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే పెట్టుకున్నావ్ మోదీ!

- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥 pic.twitter.com/rxbFsyYvYY
— BRS Party (@BRSparty) July 24, 2026