ఫస్ట్ సింగిల్ రేపే... నేను రెడీ!

July 23, 2026


img

త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో హనీష్, కావ్యా థాపర్ జంటగా నటించిన సినిమా పేరు ‘నేను రెడీ.’ దీనిలో కొంచెం కొంచెం అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్‌ శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. 

అయితే ఈ మొట్ట మొదటి పాట హీరోహీరోయిన్ల మద్య సాగే రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్‌ కాదు.. ఐటెం సాంగ్‌! బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ఈ ఐటెం సాంగ్‌తో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశిస్తున్నారు. 

హార్నిక్ ఇండియా ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష