ఖడక్ ఖడక్ కొత్త సోకులా? పళ్ళ బురుసు పాట రేపే

July 23, 2026


img

తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో వస్తున్న ‘పళ్ళ బురుసు’ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతున్నందున చిత్ర బృందం ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది.

ఈ సినిమా నుంచి ‘70 ఏళ్ళకి ఖడక్ ఖడక్ కొత్త సోకులా?’ అంటూ సాగే తొలి పాట శుక్రవారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.       

ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్రామీణ కామెడీ సినిమాలో మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రజ్వల్, గోమతి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.         

తండ్రీకొడుకుల మద్య పళ్ళు తోముకునే బ్రష్ విషయంలో జరిగిన చిన్న గొడవ కోర్టు వరకు వెళ్ళడమే ఈ సినిమా కథ. కనుక దీనిలో తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో పాటు పుష్కలంగా కామెడీ, మంచి కోర్టు డ్రామా కూడా చూపించబోతున్నారు. 

ఈ సినిమాకు రచన, దర్శకత్వం: ఉదయ్ చౌహాన్; పాటలు: సురేష్ గంగుల; సంగీతం: పవన్ సీహెచ్, కెమెరా: వినోద్ కె.బంగారి; ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి; కోరియోగ్రఫీ: విష్ణు ప్రిజర్వర్ చేశారు. 

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య పిట్టీ, వివేక్ క్రిష్ణాని కలిసి సిద్ధం చేసిన ఈ ‘పళ్ళ బురుసు’ని ఆగస్ట్ 14న ప్రేక్షకులకు అందించబోతున్నారు.  


Related Post

సినిమా స‌మీక్ష