జయకృష్ణ ఘట్టమనేని, రాషా దడాని హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ ఈ నెల 30న విడుదల కాబోతుండటంతో వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రావే చెలియా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. నాగ్ అర్జున్ రెడ్డి వ్రాసిన ఈ పాటకి జీవి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా కపిల్ కపిలన్ ఆలపించారు.
తిరుపతి పట్టణంలో ఓ అందమైన ప్రేమ కథ నేపధ్యంతో వస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ, కిక్ శ్యామ్, అజయ్, వాసుకి, మహేంద్రన్, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీతేజ్, కలెక్టర్ శ్రీనివాస్, కిల్లి క్రాంతి ముఖ్య పాత్రలు చేశారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంగీతం: జీవి.ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్‌డీ రాజశేఖర్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలోచందమామ కథలు పిక్చర్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై పి కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 30న విడుదల కాబోతోంది.