చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్‌.. తొలిప్రేమ పెద్ద తోపేమీ కాదట

July 19, 2026


img

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్‌ విడుదలైంది. చాలా సినిమాలు తొలి ప్రేమ,  రొమాంటిక్ ప్రేమ, వన్ సైడ్ లవ్, ట్రయాంగిల్‌ లవ్ స్టోరీ, చివరికి ముసలి హీరోహీరోయిన్ల లవ్ స్టోరీలు కూడా చూసేశాము. కానీ తొలి ప్రేమ విఫలమైన తర్వాత మరో కొత్త ప్రేమ కథ చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి కథతోనే తీసిన సినిమాయే ఈ చెన్నై లవ్ స్టోరీ. 

ట్రైలర్‌ చాలా బాగుంది. సినిమా కూడా అదే స్థాయిలో సాగితే కిరణ్ అబ్బవరం హిట్ లిస్టులో ఇది కూడా కలుస్తుంది. ఈ సినిమాలో సిరి హన్మంతు, మహేందర్, నరేష్, పూజ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.      

చెన్నై లవ్ స్టోరీకి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవికుమార్ నంబూరి, కధ: సాయి రాజేష్, సంగీతం: మణిశర్మ, కెమెరా: విశ్వాస డేనియల్ చేశారు. 

మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్ బ్యానర్లపై సాయి రాజేష్, ఎస్‌కెఎన్‌, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మిస్తున్న చెన్నై లవ్ స్టోరీ ఈ నెల 24న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష