నందమూరి బాలకృష్ణ ఏటా ఖచ్చితంగా ఒకటి రెండు సినిమాలతో వస్తూనే ఉన్నారు. హిట్ కొడుతూనే ఉన్నారు. అఖండ-1, 2లతో వరుస హిట్స్ కొట్టిన బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
ఇప్పుడు అబ్బాయ్ జూ.ఎన్టీఆర్‌కి సూపర్ హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివతో బాబాయ్ బాలకృష్ణ తన 112వ సినిమా చేయబోతున్నారు.
ఇది కూడా బాలయ్య మార్క్ కమర్షియల్ సినిమాయే. దీనికి ‘కార్పెంటర్’ అని పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే టైటిల్ పోస్టర్ విడుదల చేస్తే బాలయ్య ‘కార్పెంటర్’ అవునా కాదో తెలుస్తుంది.
ఈ సినిమాలో డా.రాజశేఖర్ విలన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని కలిసి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీయబోతున్నారు.
గోపీచంద్ మలినేనితో ఎన్‌బీకె 111 వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్న సినిమాలో నయనతార, కాజల్ అగర్వాల్, మంచు మనోజ్, సముద్రఖని, ఆర్.శరత్ కుమార్, ముఖ్యపాత్రలు చేస్తున్నారు. నర్గీస్ ఫఖిరీ ఐటెం సాంగ్ చేస్తున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: తమన్, కెమెరా: అరవింద్. ఎస్. కశ్యప్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 30న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.