సినీ పరిశ్రమలో ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ మళ్ళీ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండా తమపై విమర్శలు చేసినందుకు ఈ నెల 14న విచారణకు హాజరయ్యి సంజాయిషీ ఇవ్వాలని ఫెడరేషన్ కోరింది.
కానీ ఆయన హాజరు కాకపోవడంతో షో-కాజ్ నోటీస్ పంపింది. వారం రోజులలోగా లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని, అలాగే బహిరంగం క్షమాపణలు చెప్పాలని లేకుంటే చర్యలు తప్పవని దానిలో హెచ్చరించింది. అంతవరకు ఆయనకు ఫెడరేషన్‌లోని 24 క్రాఫ్ట్స్ సహాయ నిరాకరణ చేస్తారని నోటీసులో పేర్కొంది.
ఈ వివాదానికి కారణం డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలైన జానీ మాస్టర్ భార్య సుమలత తమ అసోసియేషన్‌లో కొందరు నకిలీ బిల్లులతో నిర్మాతలను మోసం చేస్తున్నారని లేఖ వ్రాయడమే.
దాని ఆధారంగా నిర్మాతలు సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నందునే తనని, తన భర్తని ఫెడరేషన్ సభ్యులు ఈవిధంగా ఇబ్బంది పెడుతున్నారని సుమలత ఆరోపించారు.
ఆవిధంగా తొలగింపబడిన పదవులను భర్తీ చేసేందుకు తాను ఎన్నికలు నిర్వహించబోతుండటం జీర్ణించుకోలేని కొందరు తమపై ఈవిధంగా బురద జల్లుతున్నారని సుమలత ఆరోపించారు.
ఎవరు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు. కనుక నిర్మాతలే పూనుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది.