పళ్ళ బురుసు ఫస్ట్ గ్లిమ్స్‌.. భలే ఉందే!

July 18, 2026


img

తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో సినిమా అంటే మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి తప్పనిసరి అన్నంత పాపులర్ అయ్యారు. వారిద్దరూ తండ్రీకొడుకులుగా నటిస్తున్న గ్రామీణ కామెడీ సినిమా ‘పళ్ళ బురుసు.’  ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ గ్లిమ్స్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రజ్వల్, గోమతి, కీలక పాత్రలు చేశారు.         

పళ్ళు తోముకునే బ్రష్ విషయంలో జరిగిన చిన్న గొడవ కోర్టు వరకు వెళ్ళడమే ఈ సినిమా. కనుక తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో పాటు చక్కటి కామెడీ, కోర్టు డ్రామా చూపించబోతున్నామని టైటిల్‌ గ్లిమ్స్‌తో చెప్పేశారు. త్వరలో టీజర్‌ విడుదలకాబోతోంది.

ఈ సినిమాకు రచన, దర్శకత్వం: ఉదయ్ చౌహాన్; పాటలు: సురేష్ గంగుల; సంగీతం: పవన్ సీహెచ్, కెమెరా: వినోద్ కె.బంగారి; ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి; కోరియోగ్రఫీ: విష్ణు ప్రిజర్వర్ చేశారు. 

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య పిట్టీ, వివేక్ క్రిష్ణాని కలిసి నిర్మిస్తున్న పళ్ళ బురుసు ఆగస్ట్ 14న ప్రేక్షకులకు అందించబోతున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష