ఒంటరి మహిళలకు పింఛన్లు వచ్చే నెల నుంచే

July 17, 2026


img

తెలంగాణలో పింఛన్ల కోసం ఒంటరి మహిళలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వారికి మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి అర్హులైన మహిళలందరికీ పించన్లు అందిస్తామని తెలిపారు. 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ పింఛన్లకు అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతోంది. మరణించిన వారు, అనర్హులుగా గుర్తించిన వారి పేర్లను తొలగించి, ఆ స్థానాల్లో కొత్తగా అర్హులైనవారి పేర్లు నమోదు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా జిల్లాల వారీగా అర్హుల జాబితాలను సిద్ధం చేస్తే మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదముద్ర వేసి ఆగస్ట్ 15న సిఎం రేవంత్ రెడ్డి లాంచనంగా ఈ పధకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మందికి ఈ పించన్లు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కనుక దీని కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న మహిళలకు మంత్రి సీతక్క ప్రకటన చాలా ఊరటనిస్తుంది. 



Related Post