ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్‌ను మరింత విస్తరించే దిశగా వరుసగా భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు.
‘పుష్ప’ సిరీస్‌తో వచ్చిన గ్లోబల్ క్రేజ్ తర్వాత ఆయన ఎంపిక చేసుకుంటున్న దర్శకుల జాబితా ఇందుకు నిదర్శనం కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా తమిళ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ దర్శకులతో బన్నీ కొత్త సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు అట్లీతో ‘రాకా’ చేస్తున్న బన్నీ, దీని తర్వాత కోలీవుడ్‌కి చెందిన మరో దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో సినిమా చేయబోతున్నారు. ఈ రెండూ పూర్తవక మునుపే ప్రముఖ మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
బాసిల్ జోసెఫ్ తన సోషల్ మీడియాలో ‘ఐకాన్’ అని రాసి ఉన్న టోపీతో పాటు ‘స్టార్’ ఎమోజీని షేర్ చేయడంతో బన్నీతో అయన సినిమా చేయబోతున్నట్లు సంకేతం ఇచ్చినట్లు భావించవచ్చు. బహుశః త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బాసిల్ జోసెఫ్ ప్రత్యేకత బలమైన స్క్రీన్ ప్లే, వినోదం, భావోద్వేగాలను పండించడం.
ఆయన తీసిన మలయాళ సినిమా ‘మిన్నల్ మురళి’ అన్ని భాషల ప్రేక్షకులను అలరించి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కనుక బన్నీతో ఆయన చేయబోయే సినిమాపై అప్పుడే చర్చలు మొదలైపోయాయి.
అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి స్టార్ దర్శకుల తర్వాత ఇప్పుడు బాసిల్ జోసెఫ్‌ని ఎంచుకోవడంతో, ఇకపై బన్నీ కేవలం టాలీవుడ్‌కి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితం కాబోరని భావించవచ్చు.