ఫౌజీ వచ్చేస్తున్నాడు.. డిసెంబర్‌లో!

July 16, 2026


img

ప్రభాస్‌ అభిమానులు ‘ఫౌజీ’ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారికి ఓ శుభవార్త! ఈ ఏడాది డిసెంబర్‌ 3న  ‘ఫౌజీ’ వచ్చేస్తున్నాడని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 

”అజ్ఞాతపర్వం ముగిసింది. ఇక తిరుగుబాటు మొదలైంది...” అంటూ రిలీజ్ డేట్ పోస్టర్‌లో సరికొత్త లుక్‌లో ప్రభాస్‌ని చూపడంతో అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.  

1940ల బ్రిటిష్ పాలన కాలంలో సాగిన పీరియడికల్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ తిరుగుబాటు చేసిన ఒక సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. రిలీజ్‌ పోస్టర్లో కూడా అదే చూపారు.  

ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్ ఇమాన్వి నటిస్తుండగా, బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపం ఖేర్, అలనాటి అందాల నటి జయప్రద కీలక పాత్రలు చేస్తున్నారు. 

మూడు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తే ఫౌజీ షూటింగ్‌ పూర్తయిపోతుందని చిత్ర బృందం తెలియజేసింది. ఇవి మరో నెలరోజుల్లోగా పూర్తయితే ఆ తర్వాత వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. త్వరలోనే ఒక లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.  

అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో చాలా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను టి-సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్‌ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తోంది. డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష