నితిన్‌కి తోడుగా నాని, జోడీగా రుక్మిణి!

July 15, 2026


img

హీరో నితిన్‌ వరుస పరాజయాలతో సతమతమవుతుంటే, నాచురల్ స్టార్ నాని నటుడిగానే కాదు.. నిర్మాతగా కూడా వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇప్పుడు నాని నిర్మాతగా తన సొంత బ్యానర్‌లో నితిన్ హీరోగా ఓ సినిమా తీయబోతున్నన్నట్లు సమాచారం.

‘దండోరా’ తో మంచి దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. మురళీకాంత్ ఇటీవల నానిని కలిసి కథ చెప్పగా అది నచ్చడంతో తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై దీనిని నిర్మించేందుకు అంగీకరించినట్లు టాక్. నితిన్‌ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.  

ఈ సినిమాలో నితిన్‌కి జోడీగా కన్నడ నటి రుక్మిణి వసంత్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న రుక్మిణీ వసంత్‌ ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆమె కూడా డేట్స్ సర్దుబాటు చేసుకొని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా అధికారిక ప్రకటన చేయాలని నాని, నితిన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Related Post

సినిమా స‌మీక్ష