మిస్టర్ మిడిల్ క్లాస్ ట్రైలర్‌... కామెడీ బాగానే ఉంది!

July 14, 2026


img

శ్రీకాంత్, లయ భార్యాభర్తలుగా నటించిన ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ట్రైలర్‌ విడుదలైంది. మద్యతరగతి ఆర్ధిక సమస్యలు, కష్టాలతో వేసారిపోయిన శ్రీవారి భక్తుడుకి హటాత్తుగా భారీగా డబ్బు, బంగారం లభిస్తే తర్వాత ఏమైంది? అనేది ఈ సినిమా. దీనిలో రాజేంద్ర ప్రసాద్ స్వామివారిగా నటించారు. సునీల్, అలీ, రఘుబాబు, వెన్నెల కిషోర్, పృథ్వీ, మురళీ గౌడ్, ప్రభాస్ శ్రీను, ధనరాజ్, అపూర్వ, రాజిత, కరుణ, భూపాల్, బాబు మోహన్, చిత్రం శ్రీను, చిట్టి, సోనియా నాయుడు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.

ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి; సంగీతం: సాయికార్తిక్; పాటలు: శివుని చంద్రశేఖర్ రెడ్డి; డైలాగ్స్: డైమండ్ రత్నబాబు, శ్రవణ్ భానుపురి; కెమెరా: 'గరుడవేగ' అంజి; ఎడిటింగ్: చోటి కె. ప్రసాద్, ఆర్ట్: చిన్న చేశారు. బ్లూ.జె క్రియేషన్స్ బ్యానర్‌పై జీకే, చందు నూతి సంయుక్తంగా కలిసి నిర్మించిన మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ నెల 17న థియేటర్లలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష