దిగజారండి... దిగజారుతూనే ఉండండి: ప్రకాష్ రాజ్

July 12, 2026


img

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ మరోసారి సోషల్ మీడియాలో తనదైన శైలిలో ఏపీ కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఇటీవల యూట్యూబర్‌ ‘ప్రశ్న రావణ్’ కేసులో ఆయనపై కూడా ఏపీ పోలీసులు కేసు నమోదు చేయడంతో ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో మెసేజ్ రిలీజ్‌ చేసారు. 

దానిలో అయన బహుశః ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి వ్యంగ్యంగా “నేను మౌనంగా ఉన్నానని మిమ్మల్ని గమనించడం లేదనుకోవద్దు. అన్నీ చూస్తూనే ఉన్నాను. మిమ్మల్ని, మీ పార్టీలని, ఎంపీలు, ఎమ్మెల్యేలని, మీకు అమ్ముడుపోయిన న్యూస్ ఛానళ్ళని అవి చెప్పే స్టోరీలు అన్నీ చూస్తూనే ఉన్నాను. 

దిగజారండి... బాగా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అని నిరూపించుకునే దిగజారండి. మా కంటే గొప్పగా ఎవరూ దిగజారలేరని మేరు గర్వంగా చెప్పుకునేలా దిగజారండి. నేను చూస్తూనే ఉంటాను. మీరు దిగజారండి. ఇంకా ఇంకా దిగజారుతూనే ఉండండి,” అని వ్యంగ్యంగా అన్నారు. 

ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం... 


Related Post